ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా 24వ రోజుకు చేరింది. ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 39 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 4 వరకూ 39 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.