గోదుమ రంగులో ఉన్న జింకలను ఎప్పుడూ చూస్తుంటాం. కానీ, తెలుపు రంగులో ఉన్న జింకను మీరెప్పుడైనా చూశారా? ఇలాంటి ఓ జింక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మంచు ప్రాంతంలో ఈ అరుదైన జింకను ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేశారు. అయితే, 30వేల కంటే ఎక్కువ జింకల జననంలో ఇలాంటి ఒక తెలుపు వర్ణపు జింకలు జన్మిస్తుంటాయని జువాలజిస్టులు చెబుతున్నారు. ఇలాంటి జింకను చూస్తే అంతా మంచి జరుగుతుందని అమెరికన్లు నమ్ముతారు.