ప్రయాగరాజ్ కుంభమేళాకు కోట్ల మంది రావడంతో పరిసర ప్రాంతాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. బస్సు ట్రాపిక్ జామ్‌లో చిక్కుకుపోవడం, చాలా నెమ్మదిగా కదులుతుండడంతో కొందరు వ్యక్తులు టూరిస్ట్ బస్సు టాప్ పైకి చేరుకుని హాయిగా పేకాట ఆడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అద్భుతమైన ఆలోచన అంటూ కామెంట్లు పెడుతున్నారు. .