YCP అధినేత వైఎస్ జగన్ మరోసారి నోరు జారారు. పాలనలో చంద్రబాబు విఫలం అయ్యారని విమర్శించే క్రమంలో ఎన్నికల ఫలితాల తేదీని జగన్ మార్చిపోయారు. మే 13 ఎన్నికలు జరిగిన తేదీనే ఎన్నికల ఫలితాల తేదీగా చెప్పారు. మే 13న ఫలితాలు వచ్చాయని అప్పటి నుంచి చంద్రబాబు సీఎంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో పలువురు ఈ వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.