సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వైరల్ జ్వరాల బారిన పడకుండా జాగర్తలు తీసుకోవాలని నాయుడువలస పాఠశాల ఇంఛార్చ్ ప్రధానోపాధ్యాయులు జె. సి రాజు అన్నారు. శుక్రవారం పాఠశాలలో సీసనల్ వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు ద్వారా వ్యాపించే వ్యాధులు, జ్వరాలు మలేరియా, డెంగ్యూ, ప్రమాదకరమైనవని, కొన్నిసార్లు మరణానికి దారితీస్తాయన్నారు.