ఓ సామాన్యుడు మెసేజ్ కు స్పందించిన మంత్రి నాదెండ్ల

85చూసినవారు
ఓ సామాన్యుడు మెసేజ్ కు స్పందించిన మంత్రి నాదెండ్ల
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి బొబ్బిలి పట్టణానికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి మెసేజ్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళగా గత మూడు సంవత్సరాలుగా రేషన్ కార్డులో యాడింగ్ అవడంలేదని టెక్స్ట్ మెసేజ్ లొ పొందుపరిచారు. ఆయన భార్య అరుణ జ్యోతి అనే పేరును వాళ్ల అమ్మగారు కార్డులో పేరు తొలగించామని మరల తమ యొక్క కార్డులు యాడింగ్ కొరకు ప్రయత్నించిన సరే జరగటం లేదని మంగళవారం మధ్యాహ్నం 3. 06 నిమిషాలకు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కి చరవాణి ద్వారా ఫిర్యాదు చేయగా వెంటనే మంత్రి స్పందించి తమకు న్యాయం జరిగేటట్టు విజయనగరం జిల్లా డీఎస్ఓ కార్యాలయంకి ఫిర్యాదు పంపడం జరుగుతుందని మెసేజ్ ద్వారా తెలిపారు. మంగళవారం సాయంత్రం 4. 32 నిమిషాలకు డీఎస్ఓ కార్యాలయం నుండి ఆ లబ్ధిదారుడికి ఫోన్ చేయడం జరిగింది ఈనెల చివరి వరకు యాడింగ్ ఆప్షన్ వస్తుందని ఆ సమస్య పరిష్కరించేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్