బొబ్బిలి పాతకోటలో గల మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంఘం అధ్యక్షులు అప్పారావు, అధ్యక్షులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ట్రెజరర్ వి ఎన్ శర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ వి ఎస్. కె. కె రంగారావు(బేబీ నాయన), మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి, ప్రపంచ యుద్ద వీరులు బెవర అప్పన్న ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ముందుగా ఎం. ఎల్. బేబీనాయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.