మెరకముడిదాం మండలం సోమలింగాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేసిన ఎమ్మెల్యే కళావెంకటరావు అనంతరం అయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అయన ఆకాక్షించారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక పేద
విద్యార్థులకు మరింత ఊరట కలిగిందని పేర్కొన్నారు.