కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులతో పలు ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా వ్యవసాయ అధికారి వీ. టి. రామారావు అన్నారు. గురువారం బొండపల్లి మండలంలోని ఒంపల్లి, కొండకిండాం, రాచకిండాం గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో అవగాహన సదస్సులు జరిగాయి. ఈ పంట నమోదుపాటు పంట నష్ట పరిహారాలు పంటల భీమా తదితర ప్రయోజనాలు లభిస్తాయన్నారు. మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు పాల్గొన్నారు.