గజపతినగరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బుధవారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. ఉపాధి పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమా పరమేశ్వరి ఆధ్వర్యంలో జరిగింది. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ పనులతో పాటు పింఛన్లు తదితర వాటిపై చర్చించారు. ఏపిడి జనార్ధన్, ఎంపీడీవో జయంతి ప్రసాద్, ఏపీవో సిహెచ్ రామారావు, జడ్పిటిసి గార తౌడు తదితరులు పాల్గొన్నారు.