గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సి. ఐ జి ఏ వి రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తు చేశారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. గజపతినగరం ఎస్. ఐ మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.