దత్తిరాజేరు మండలంలోని షికారుగంజి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసన్నలక్ష్మికి ఘనసత్కారం లభించింది. గత పది సంవత్సరాలుగా ఆదర్శ పాఠశాలను అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తున్నందుకు గురువారం ఆ గ్రామానికి చెందిన అమ్మ సేవా ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి సురేష్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రసన్నలక్ష్మికి శాలువ కప్పి జ్ఞాపకను అందజేసే సత్కరించారు.