గజపతినగరంలో స్వాతంత్ర సంబరాలు గురువారం ఘనంగా జరిగాయి. గజపతినగరం కోర్టు వద్ద న్యాయమూర్తి కనకలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రత్నకుమార్ జాతీయపతాకాన్ని ఎగురువేయగా, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక అధికారి రవి ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.