ఎన్నికలకు ముందు ఎలా కలిసికట్టుగా పని చేసామో అనంతరం అదేవిధంగా పని చేద్దామని బి. జె. పి జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు అన్నారు. ఆదివారం బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలలో బిజెపి జనసేన నాయకులకు కూడా సమాచారం అందించాలన్నారు. నాడు ఏ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పామో వాటిపై దృష్టి సారించాలన్నారు. బిజెపి
నేతలు ఏడుకొండలు సింహాచలం రామకృష్ణ పాల్గొన్నారు.