అమ్మ పాలు అమృతంతో సమానమని ఐసిడిఎస్ పర్యవేక్షకులు కె. పద్మ అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం గంట్యాడ మండలంలోని మదనాపురం లో జరిగిన అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు ఇవ్వడం ద్వారా రోగాలు దరిచేరమన్నారు. అనంతరం పలు నినాదాలు చేస్తూ గ్రామంలో అవగాహన ర్యాలీ జరిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.