పారిశుధ్య కార్మికులకు ఘన సత్కారం

62చూసినవారు
పారిశుధ్య కార్మికులకు ఘన సత్కారం
స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారం పారిశుద్ధ్య కార్మికులు, పంపు ఆపరేటర్లు, డ్రైవర్లకు ఘన సత్కారం చేశారు. గురువారం గజపతినగరంలోని పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని సర్పంచ్ నరవ కొండమ్మ ఎగరవేశారు. ఈ సందర్భంగా వారికీ మిఠాయిలు, 5 కిలోల బియ్యం, బ్యాగులు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ కర్రి రామునాయుడు, టిడిపి సీనియర్ నాయకులు, గోపాలరాజు, కార్య నిర్వహణ అధికారి మంత్రి రమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్