దత్తిరాజేరు మండల తహసిల్దార్ గా పి. విజయభాస్కర్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతవరకు విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం తహసిల్దార్ గా పనిచేస్తూ ఎన్నికల బదిలీల్లో భాగంగా సొంత జిల్లా విజయనగరానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందితో పాటు పలువురు తహసిల్దార్ విజయభాస్కర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.