విపత్తుల నిర్వహణలో భాగంగా భోగాపురం మండలం చేపల కంచేరు ఎం. పి. యూ. పి పాఠశాల వద్ద బుధవారం భూకంపం పై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎస్. డి. ఆర్. ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్. ఐ చంద్ర శేఖర్ నేతృత్వంలో పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. భూకంపాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందించి, అత్యవసర వాహనాల్లో ఆసుపత్రికి తరలించడం వంటి కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు.