అర్హులైన కొత్తవారికి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తోందని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి వెల్లడించారు. నెల్లిమర్ల మండలం ఒమ్మిలో గురువారం ఆమె పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం వలె కొత్త పింఛన్లుకోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండదని చెప్పారు. వృద్ధులకు ప్రభుత్వం భరోసా కల్పించడానికే ఫించన్లు పెంపుదల చేసినట్లు చెప్పారు.