మహాలక్ష్మి అమ్మవారికి గంధం అలంకరణ

81చూసినవారు
మహాలక్ష్మి అమ్మవారికి గంధం అలంకరణ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీరామచంద్రస్వామి వారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీమహాలక్ష్మి అమ్మవారికి గంధంతో విశేషంగా అలంకరించారు. ప్రాత: కాలార్చన, బాలభోగం అనంతరం యాగశాలలో సుందరకాండ హవనం, మండపంలో ఉత్సవమూర్తులకు నిత్య కళ్యాణాన్ని అర్చకులు నిర్వహించారు. శ్రావణ శుద్ధ ఏకాదశి, రెండో శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీమహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం జరిపించారు.

సంబంధిత పోస్ట్