జిల్లా కలెక్టర్ ను కలిసిన విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ ను ఏపీ ఈపీడీసీఎల్ జిల్లా పర్యవేక్షక ఇంజనీర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కే చలపతిరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన కలెక్టర్ శ్యాంప్రసాద్ కు జిల్లాలో గల విద్యుత్ వ్యవస్థ పనితీరు, సరఫరా తదితర అంశాలపై చర్చించారు. కిందిస్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకొని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందేలా కృషి చేయాలని కలెక్టర్ ఈ ఈ కి సూచించారు.