వేలాదిమంది రైతులకు సాగునీరు అందించే నారాయణపురం ఆనకట్టను ఇరిగేషన్ అధికారులు గాలికొదిలేశారు. కోట్లాది రూపాయల జైకానిధులు ఉన్నా ఆనకట్ట అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ కాసులు కురిపించే పూడికతీత, మట్టి పనులకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఆనకట్ట శిధిలావస్థకు చేరినా షటర్లు, రెగ్యులేటర్ వ్యవస్థను పట్టించుకోవడం లేదు. కుడి ఎడమ ప్రధాన కాలువల్లో పూడికతీత పనుల నిమిత్తం లక్షల రూపాయలు కావాలంటూ ప్రతిపాదనలు పంపడం విశేషం.