సంక్రాంతి వేడుకల్లో ఎవరైనా హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని, పండగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శనివారం రేగిడి ఆమదాలవలస ఎస్ఐ పి నీలావతి హెచ్చరించారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ జూదం, అశ్లీల నృత్యాలు, కోడి పందాల నిర్వాహకులకు ఎటువంటి అనుమతులు లేవని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సంయుక్తంగా దాడులు నిర్వహించి నిర్వాహకులపై కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.