గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి అంతర్ రాష్ట్ర సరిహద్దు పోలిసు స్టేషన్ లైన ఇచ్చాపురం, కవిటి పోలిసు స్టేషన్, అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలిసు స్టేషన్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లాకప్, కంప్యూటర్, ప్రాపర్టీ, రికార్డులు భద్ర పరిచే గదులు పరిశీలించారు. స్టేషన్ పరిధిలో గ్రామాలు, సరిహద్దు ప్రాంతాలు భౌగోళిక స్వరూపంపై ఆరా తీశారు.