వంగర: ప్రజాస్వామ్యానికి దిక్సూచి అంబేద్కర్ : ఎమ్మెల్యే

68చూసినవారు
వంగర: ప్రజాస్వామ్యానికి దిక్సూచి అంబేద్కర్ : ఎమ్మెల్యే
వంగర మండలం కొప్పరవలస గ్రామంలో ఆదివారం డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ చేసిన కృషిని, ఆశయాలను ప్రతీ ఒక్క యువత ముందుకు తీసుకొని వెళ్ళాలన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అణుగుణంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు మజ్జి గణపతి, ఎం. గణపతిరావు, చిన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్