కొత్తవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి భీమ శంకరరావు పాల్గొన్నారు. జిల్లాలో 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న 5 వేలమంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.