ఎల్ కోట మండలంలో ఉచిత పశు వైద్య శిబిరం

83చూసినవారు
ఎల్ కోట మండలంలో ఉచిత పశు వైద్య శిబిరం
ఎల్ కోట మండలం లింగంపేట లో వెటర్నరీ డాక్టర్ గాయత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. చూలు తనిఖీ చేసి గర్భాధారణ ఇంజెక్షన్లు వేశారు. రైతులకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. జిల్లా బహుళార్థ పశు వైద్యశాల డిడి మహాలక్ష్మి, జిల్లా పశు వ్యాధి నిర్ధారణ శాల ఏడి రాంప్రసాద్ వైద్య శిబిరాన్ని సందర్శించి పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్