ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం ఎం నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు సంబంధించిన పనులను బుధవారం సంబంధిత డి ఈ, ఏ ఈ లతో కలిసి పర్యవేక్షించారు. ఆగస్టు 15న ఏర్పాటు కానున్న అన్న క్యాంటీన్లు పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.