ఎస్ కోట మండలం వసిలో వ్యవసాయ క్షేత్రాలను ఏవో రవీంద్ర గురువారం సందర్శించారు. ఈ మేరకు ఆయన వరి నారు చివర్లు తుంచి నాటే విధానాన్ని రైతులకు వివరించారు. ఈ విధానం అవలంబించడం వల్ల ఆకు చివర్లలో గుడ్లు పెట్టి వరి ఆశించే పురుగులను మొదటి దశలోనే నివారించవచ్చని, ప్రతి 20 మీటర్లకు కారి బాటలు తీయడం వల్ల పంటకు గాలి, వెలుతురు పుష్కలంగా తగిలి చీడపీడలు నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో వి ఏ ఏ రవి, వివేక్ పాల్గొన్నారు.