తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
By k.chetan 79చూసినవారుతల్లిపాలు అమృతంతో సమానమని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను స్థానిక ఘోషా ఆసుపత్రిలో గురువారం ప్రారంభించారు. తల్లిపాల శ్రేష్టతను వివరిస్తూ రూపొందించిన గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. తల్లిపాలు సహజ సమతుల్య ఆహారమని, వీటిద్వారా శక్తితోపాటు ఎన్నో విలువైన పోషకాలు తల్లిపాలతో బిడ్డకు అందుతాయన్నారు.