జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి కొండపల్లి

558చూసినవారు
విజయనగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. శాంతికి ప్రతీకగా కపోతాలను జిల్లా కలెక్టర్ అంబెడ్కర్, ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి మంత్రి ఎగురవేశారు. అనంతరం ఆహూతులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్