స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. ఆర్. అంబేద్కర్ తెలిపారు. ఈ ఎన్నికలను మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రశాంతంగా జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణను ఎం. ఈ. ఓ లు, లా అండ్ ఆర్డర్ అంశాలను తహసిల్దార్లు పర్యవేక్షించాలన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ ఎం. ఈ. ఓలకు, తహసిల్దార్లకు పలు సూచనలు జారీ చేసారు.