మలేరియా, డెంగ్యూ జ్వరాలు పార్వతీపురం జిల్లాను వణికిస్తున్నాయని దీనిపై సంభదిత అధికారులు వెంటనే స్పందించాలని.. జాతీయ మానవ హక్కుల కమిటీ మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ విజృంభిస్తున్న విషజ్వరంలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటికిటలాడుతూన్నాయని, సరైన వైద్యం అందక పరిస్థితులు విషమించడంతో వారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చికిత్స కోసం పరుగులెడుతున్నారన్నారు.