వరద బాధితుల సహాయార్ధం జిల్లా నుంచి రెండు లక్షల వాటర్ ప్యాకెట్లతో కూడిన రెండు ట్రక్కులు బుధవారం జిల్లా కేంద్రం నుండి బయలుదేరాయి. గ్రామీణ నీటిసరఫరా విభాగం వాటర్ ప్యాకెట్లను విజయవాడకు పంపించే ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ కార్యాలయం వద్ద రెండు లారీలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ బి. ఆర్. అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్ తో కలసి బుధవారం ప్రారంభించారు.