రాష్ట్రంలో మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీల పై సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కనీసం చర్చకు తీసుకురావకపోవడం బాధకలుగుతోందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో తాండవ, ఏటికొప్పాక, అనకాపల్లి, భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ లను తెరిపిస్తానని సీఎం చంద్రబాబు, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ప్రజలకు హామీ ఇచ్చారన్నారు.