ఆరోగ్య రంగంలో ప్రాథమిక స్థాయిలో వైద్య సేవలు నిర్వహించే ఆశాలు తీవ్రమైన పని భారం, ఒత్తిడితో అనారోగ్యాలకు గురవుతున్నారని ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు మహాలక్ష్మి, వెంకటలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం విజయనగరం అర్బన్ , రూరల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లపై పని భారం, ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుందని, వేతనాలు మాత్రం పెరగడం లేదన్నారు.