బొబ్బిలి మండలం రంగరాయపురం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ పక్వాడ కార్యక్రమాన్ని సూపర్వైజర్ యన్. ప్రభావతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పోషకాహారం దాని ప్రాధాన్యత, వెయ్యి రోజుల ప్రణాళిక, గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ పుట్టిన రెండు సంవత్సరాల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.