బాడంగి: బురదమయంగా రోడ్డు.. ప్రయాణికుల తిప్పలు

85చూసినవారు
బాడంగి: బురదమయంగా రోడ్డు.. ప్రయాణికుల తిప్పలు
బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం పిండ్రంగివలస నుంచి దత్తిరాజేరు మండలం కొరపకృష్ణాపురం వెళ్లే రోడ్డు గోతులు, బురదమయంగా ఉండడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. రోడ్డుపై గోతులు ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరడంతో బురదమయంగా మారింది. దీంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్