బొబ్బిలి మండలంలోని కొయ్య కొండవలస గ్రామంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది ఆధ్వర్యంలో సారా తయారీ కేంద్రాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ శివారులో సారా తయారీకి నిల్వ ఉంచిన సుమారు 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మెట్ట శ్రీనివాసరావు, కానిస్టేబుల్ ప్రసాదరావు పాల్గొన్నారు.