బొబ్బిలి గ్రోత్ సెంటర్ బెర్రీ పరిశ్రమలో విద్యుత్ షాక్ తో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50 లక్షల నష్టపరిహారం అందించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకరరావు, మండల నాయకులు జి. అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడుతూ పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని చెప్పారు.