బొబ్బిలిలో చల్లని గాలులు వీచాయి. మంగళవారం ఉదయం చిరుజల్లులు కురిశాయి. పట్టణంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండడంతో వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ఈ వర్షం చెరకు, వరినారు మడులకు, కూరగాయలు సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.