బొబ్బిలి: ప్రభుత్వ భూములు కబ్జాపై సమగ్ర దర్యాప్తు చేయాలి

51చూసినవారు
బొబ్బిలి: ప్రభుత్వ భూములు కబ్జాపై సమగ్ర దర్యాప్తు చేయాలి
ప్రభుత్వ భూములు కబ్జాపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. గురువారం బొబ్బిలి లోని సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ భూములు భూకబ్జాదారుల చేతిలో చిక్కుకుంటున్నాయని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు ప్రభుత్వ భూముల్లో సర్వే చేపట్టి, ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్