బొబ్బిలి: ఘనంగా మట్టల పండగ

74చూసినవారు
బొబ్బిలి: ఘనంగా మట్టల పండగ
క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని బొబ్బిలి పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థాన పండుగను(ఈస్టర్‌) పురస్కరించుకుని ఆయన అనుభవించిన శ్రమదినాలకు గుర్తుగా 40 రోజులపాటు క్రైస్తవులంతా ఉపవాసంలోను, దానధర్మంలోను పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మట్టల ఆదివారం నిర్వహించారు. ఈతమట్టలు చేతపట్టి హోసన్న గీతం పాడుతూ పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్