బొబ్బిలి: కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

68చూసినవారు
బొబ్బిలి: కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య
కడుపునొప్పి తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడి, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన సంఘటన రామభద్రపురం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని అప్పలరాజుపేటకు చెందిన బెవర సింహాచలం (65) కడుపునొప్పి తాళలేక ఆదివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్