ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి, పుస్తకాలు మొదలైన పేర్లతో అధికంగా వసూలు చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్. నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బొబ్బిలిలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఫీజుల దోపిడీని తక్షణమే నియంత్రించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.