బాబా సాహెబ్ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం బొబ్బిలి రైల్వే పోలీస్ అవుట్ పోస్టు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సెల్యూట్ చేశారు. అనంతరం పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.