రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ సభ్యులుగా బొబ్బిలి పట్టణానికి చెందిన ప్రముఖ కంటి వైద్యులు అప్పారావు నియామకమయ్యారు. ఇందుకు సంబంధించి ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డి. శ్రీహరి రావు, రిజిష్ట్రార్ ఐ. రమేష్ ఉత్తర్వులు జారీ చేసినట్లు బుధవారం ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ సభ్యుడిగా ఎన్నికైన అప్పారావును పట్టణంలో పలువురు వైద్యులు అభినందించారు.