బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లిలో సోమవారం భవానీల ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుభవాని కంచెర్ల భవాని ఆధ్వర్యంలో వందమందికిపైగా భవానీ భక్తులు విజయవాడ దుర్గామల్వేశ్వర అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. వారంతా భవానీ మాలాధారణకు సంబంధించిన ఇరుముడి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గొల్లపల్లి నుంచి రైల్వేసేషన్ వరకు భవానీలు ర్యాలీగా తరలివెళ్లారు.