ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కొట్టక్కి గ్రామానికి చెందిన గేదెల సత్యనారాయణ, సాలూరు మండలం పురోహితుని వలస గ్రామానికి చెందిన వ్యక్తి గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియ రాలేదు.