బొబ్బిలి: రక్త దాతలే..ప్రాణ దాతలు: జె సి రాజు

62చూసినవారు
బొబ్బిలి: రక్త దాతలే..ప్రాణ దాతలు: జె సి రాజు
రక్తదాతలే ప్రాణదాతలని, వారే సమాజంలో నిజమైన హీరోలని రోటరీ జిల్లా చైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ లైఫ్ టైం సభ్యులు జె సి రాజు అన్నారు. బుధవారం బొబ్బిలి మండలం కోమటిపల్లి తాండ్ర పాపారాయ ఇంజనీరింగ్ ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సూచనతో రక్త దానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్త ఇవ్వటం ద్వారా ఆ వ్యక్తికి ప్రాణం పోయటమే కాకుండా ఆ కుటుంబం అంతటిని సంతోషంగా ఉండేలా చేస్తారన్నారు.

సంబంధిత పోస్ట్